గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి నయనతారకు తండ్రిగా నటించిన నటుడు ఎవరో తెలుసా?

తాజాగా చిరంజీవి మోహన్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విజయదశమి సందర్భంగా విడుదలై ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం మంచి విజయం సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమాలో పెద్ద ఎత్తున స్టార్ సెలబ్రిటీలు నటించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో నయనతార చిరంజీవి అన్నా చెల్లెలుగా నటించారు. వీరికి తండ్రి పాత్రలో నటించిన ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకానొక సమయంలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సర్వదావన్ బెనర్జీ గురించి ఇప్పటి తరం ప్రేక్షకులకు తెలియక పోయినప్పటికీ ఈయన ఇండస్ట్రీలో అద్భుతమైన నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. విశ్వనాథ దర్శకత్వంలో సిరివెన్నెల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు సర్వదావన్ బెనర్జీ.

ఈ సినిమాలో నటి సుహాసినితో కలిసి అందుడి పాత్రలో నటించిన ఈయన తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా సిరివెన్నెల సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సర్వధావన్ దాదాపు 35 సంవత్సరాల తర్వాత తిరిగి గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.