Big Boss Non stop: బిగ్ బాస్ ఓటీటీ కోసం నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Big Boss Non stop: తెలుగు భాషలోనే కాదు, హిందీ తమిళ, కన్నడ, మలయాళంలో కూడా బిగ్ బాస్ చాలా ప్రాచుర్యం పొందింది. రియాలిటీ షో అనగానే గుర్తుకు వచ్చేది టెలివిజన్ లో బిగ్ బాస్ కార్యక్రమం మాత్రమే. ఆడేవారి కంటే చూసే వారికి ఎక్కువగా వినోదాన్ని పంచుతోంది బిగ్ బాస్. అయితే ఇపుడు టీవీ నుండి వెళ్ళిపోయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ మరింత వినోదాన్ని అందిస్తుంది.

24గంటలు నిరంతరం ప్రసారమయ్యే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో హిందీలో అపుడే ఒక సీజన్ ముగించుకుని సూపర్ హాట్ అయింది. ఇక తమిళ తెలుగు బాషలలో ఇపుడు ప్రారంభించారు. తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా కమల్ హాసన్ తప్పుకుని శింబు కొత్త హోస్ట్ గా రాబోతున్నాడు. ఇక తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే 24 గంటల బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా నాగార్జున ఉండరనే పుకారు బాగా వినిపించిన చివరికి వాటికీ చెక్ పెడుతూ బిగ్ బాస్ హోస్ట్ గా ఆయనే వచ్చారు. అయితే ముందు బిగ్ బాస్ లో లాగా శనివారం, ఆదివారం హోస్ట్, ఇంటి సభ్యులతో మాట్లాడుతారు.

కొత్తగా ప్రారంభమైన ఓటీటీలో బిగ్ బాస్ లో నాగ్ శనివారం మాత్రమే కనిపించనున్నాడు. ముందు బిగ్ బాస్ షో కు నాగార్జున పోస్ట్ గా వ్యవహరించడం కోసం ఏకంగా పది నుండి పన్నెండు కోట్లు అందుకున్నట్టు సమాచారం. ఇపుడు నానస్టాప్ బిగ్ బాస్ కు శనివారం మాత్రమే హోస్టింగ్ కాబట్టి ఎనిమిది నుండి తొమ్మిది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి.