ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంత ఆస్తి కూడా పెట్టారో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుల్లో ఒకరైన హరికృష్ణ గారి కుమారుడు. జూనియర్ ఎన్టీఆర్ 20 మే 1983 లో హరికృష్ణ శాలినికి హైదరాబాదులో జన్మించాడు. తన విద్యాభ్యాసం కొంత గుడివాడలో తరువాత హైదరాబాదులో జరిగింది.ఇక జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలోనే చదువుతోపాటు నటనలోనూ కూచిపూడిలోను ఓనమాలు దిద్దాడు. బాల నటుడిగా పలు సినిమాలలో నటించిన ఎన్టీఆర్ హీరోగా మొదటిసారి నిన్ను చూడాలని సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.

అదే సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ మంచి విజయం సాధించి కాసుల వర్షం కురిపించింది. ఇలా ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఈయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా ఎన్టీఆర్ పలు సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతూ అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సక్సెస్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్లో ఎన్నో ఆటంకాలు వచ్చిన వాటిని ఎదుర్కొని తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగు సినీ అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ,తారక రామ్, యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు.

తాజాగా నటించిన ఆర్ ఆర్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలే కాకుండా బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ షోలకు హోస్ట్ గా కూడా పని చేశాడు. అంతేకాకుండా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నాడు. ఇలా సినిమాలు బుల్లితెర కార్యక్రమాలు అలాగే పలు యాడ్స్ ద్వారా ఎన్టీఆర్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. పలు మీడియా కథనాల ప్రకారం మన యంగ్ టైగర్ ఆస్తి దాదాపుగా 500 కోట్లు పైగా ఉన్నట్లు సమాచారం. ఇలా ఈయన భారీగా ఆస్తులను కూడా పెట్టడమే కాకుండా ఎంతో లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ఇష్టపడతారు. కోట్లు విలువ చేసే కార్లు, బంగ్లాలు, చివరికి ఆయన ఉపయోగించే వస్తువులు కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుంటాయి.