సీతారామం హీరోయిన్ నటించిన తెలుగు తొలి సీరియల్ ఏదో తెలుసా?

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం సీతారామం. ఎటువంటి అంచనాలు తెలుగు, తమిళ భాషలలో ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇక సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసి విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్ మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి. దుల్కర్ సల్మాన్ మొదటిసారిగా నటించిన తెలుగు సినిమా సీతారామం. ఇక బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ కూడా మొదట సీరియల్స్ లో నటించింది ఆ తర్వాత నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా హింది లో రీమేక్ చేశారు. ఈ సినిమాలో మొదటిసారిగా హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో మృణాల్ నటించిన మొట్ట మొదటి సినిమా సీతారామం.

అయితే ఈ సినిమా విడుదల కాకముందే మృణాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన వ్యక్తి అని చాలమంది కి తెలియదు. ఎందుకంటె హిందీలో మృణాల్ నటించిన కుంకుమ భాగ్య అనే సీరియల్ తెలుగులో డబ్ చేసి జీతెలుగు ఛానల్ లో ప్రసారం చేశారు. ఈ సీరియల్ తెలుగులో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సీరియల్ ద్వారా మృణాల్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక ఇప్పుడు సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించిన మృణాల్ తన అందం, అభినయంతో వెండి తెర ప్రేక్షకులని కూడా బాగా ఆకట్టుకుంది.