చిరంజీవి అడిగే ధైర్యం నీకుందా… అల్లు అరవింద్ కు మార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు. ఈయన అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ నటుడిగా ఈయనకు పెద్దగా కలిసి రాకపోవడంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి అల్లు అరవింద్ కి ఒక స్టార్ హీరో దగ్గర చేదు అనుభవం ఎదురైనట్లు తాజాగా ఒక మీడియా సమావేశంలో వెల్లడించారు.

అల్లు అరవింద్ నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం జల్సా. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించినదో మనకు తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా ముఖేష్ ఋషి నటించారు. అయితే ఈ క్యారెక్టర్ లో ముందుగా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని అనుకున్నారట. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ మమ్ముట్టికి ఫోన్ చేసి మేము ఓ మంచి సినిమా చేస్తున్నాము. ఆ సినిమాలో మీరు నటించాల్సి ఉంది అని అడగడంతో మమ్ముట్టి కూడా సంతోషంగా తను నటించాల్సిన పాత్ర గురించి అడిగారట.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న జల్సా సినిమాలో మీరు విలన్ గా నటించాలని చెప్పినప్పుడు మమ్ముట్టి ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదే విషయం మీ బావ చిరంజీవి గారిని నటించమని అడుగుతారా అని ప్రశ్నించారట. అందుకు అల్లు అరవింద్ లేదని సమాధానం చెప్పడంతో మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటూ ఆయన కోపం వ్యక్తం చేయగా తన కోపాన్ని గ్రహించిన అల్లు అరవింద్ సారీ సార్ అంటూ ఫోన్ కట్ చేశారట. ఈ విధంగా చిరంజీవితో పాటు సమానంగా క్రేజ్ సొంతం చేసుకున్న మరొక స్టార్ హీరోని విలన్ గా నటించమని అడగడంతో మమ్ముట్టి అలా రియాక్ట్ అయ్యారని తాజాగా మీడియా సమావేశంలో భాగంగా అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు.