ఇష్టం లేకపోయినా కూడా ఆ పాత్రలలో నటించా.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఎల్బీ శ్రీరామ్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన ఎల్బీ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 250కు పైగా సినిమాలలో నటించిన ఎల్బీ శ్రీరామ్ నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా ఎన్నో సినిమాలకు పని చేసిన ఎల్బీ శ్రీరామ్ రచయితగా కూడా ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు.ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎల్బీ శ్రీరామ్ తన సినీ జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈ ఇంటర్వ్యూలో ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. రచయితగా కన్నా నటుడిగానే నేను మంచి గుర్తింపు పొందాను. నా నటన నాలో ఉన్న రచయితను డామినేట్ చేసిందని నేనెప్పుడూ భావించలేదు. నాటకాలు రాసే టైంలో చాలా నాటకాలకు రచయితగా పనిచేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించిన ఎల్బీ శ్రీరామ్.. రైటర్స్ రాసిన డైలాగ్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే కమెడియన్లకే సాధ్యమని చెప్పుకొచ్చాడు. ఇక కొన్ని సినిమాలలో ప్రత్యేక యాసతో మాట్లాడి ప్రేక్షకులను మెప్పించిన ఎల్పీ శ్రీరామ్.. అలా డైలాగ్ డెలివరీ కొత్తగా ఉండాలని ఎంతో పట్టుబట్టి ప్రాక్టీస్ చేసే వాడినని వెల్లడించాడు.

తాను నటించిన 250 పైగా సినిమాలో 100 సినిమాలలో మంచి పాత్రలలో నటించానని..కొన్ని సందర్భాలలో ఆ పాత్రలలో నటించటం ఇష్టం లేకపోయినా కూడా నటించాల్సి వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇండస్ట్రీలో కి వచ్చిన కొత్తలో తనకు ఇష్టం లేని ఎన్నో పాత్రలలో నటించానని.. ఒకవేళ ఆ పాత్రలలో నటించకపోతే మళ్ళీ సినిమాలో నటించే అవకాశాలు రావని భయంతో ఇష్టం లేకపోయినా కూడా నటించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇ.వి.వి సత్యనారాయణ గారు అంటే తనకి చాలా ఇష్టమని ఆయన వెల్లడించారు. ఇక తను నటించిన సినిమాలలో సొంతూరు అంటే చాలా ఇష్టమని… తాను రైటర్ గా పని చేసిన అప్పుల అప్పారావు సినిమా ఇష్టమని వెల్లడించాడు.