అతి చిన్న వయసులోనే దివ్యభారతి మరణం ఇప్పటికీ రహస్యమే.. ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక?

దగ్గుబాటి హీరో వెంకటేష్ సరసన బొబ్బిలి రాజా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటి దివ్యభారతి. సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి తరువాత అంతటి అందాన్ని సొంతం చేసుకున్న దివ్యభారతి ఎంత చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చారో అంతే చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈమె 16 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను చేశారు. ఇలా ఈమె తెలుగులో నటించిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన సినిమా సూపర్ హిట్ కావడంతో ఒకేసారి 14 సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇలా ఒక బాలీవుడ్ సినిమా షూటింగ్ కునాల్లో పూర్తి చేసుకుని తిరిగి ముంబై చేరుకున్న ఈమె అర్జెంటుగా తన డిజైనర్ ని ఇంటికి రమ్మని పిలిచారట. ఇలా వారితో కాసేపు సరదాగా ముచ్చటించిన దివ్యభారతి వారికోసం ఏదైనా తీసుకురావడానికి కిచెన్ లోకి వెళ్లారని కిచెన్ లోకి వెళ్లిన ఆమె కిచెన్ బయట బాల్కనీ నుంచి కిందికి జారిపడ్డారని వార్తలు వచ్చాయి.

ఇలా బాల్కనీ లోనుంచి జారిపడటంతో ఒకేసారి ఐదు అంతస్తులు ఉండటం వల్ల ఈమె తీవ్ర రక్తస్రామానికి గురై కొను ఊపిరి నడుమ ఆస్పత్రికి తరలిస్తున్న నేపథ్యంలో మృతి చెందిందని తెలుస్తోంది.అయితే ఇండస్ట్రీలోకి 16 ఏళ్ల వయసులో వచ్చిన దివ్యభారతి 19 ఏళ్లకే ఎంతో స్టార్డమ్ సంపాదించుకొని ఇలా ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఒక్కసారిగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.అయితే ఈమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది ఇది ప్రమాదవశాత్తు జరిగినదా లేక ఈ మరణం వెనుక ఎవరి ప్రమేయం అయినా ఉందా అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.మనం ఎన్ని తలుచుకున్న పోయినవారిక తిరిగిరారు కానీ సినిమా ఇండస్ట్రీ ఒక మంచి నటిని కోల్పోయిందనేది మాత్రం నిజం.