ఆమె ఓ సినీ నటి. ఓ పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చింది. భర్త నుంచి దూరంగా వుంటోందిట.! విడాకులు అయిపోయాయని అంటున్నారుగానీ, అధికారికంగా ఆ తంతు ముగిస్తే.. ప్రకటించేస్తారు కదా.!
సోషల్ మీడియాలో తమ జీవిత భాగస్వామి ఇంటి పేరుని తొలగించడం అనేది, విడాకుల ప్రక్రియ ప్రారంభమైందనడానికి సంకేతం. ఫొటోలు పూర్తిగా తొలగిస్తే, విడాకులు అయిపోయాయని అర్థం.
సమంత విషయంలో అదే జరిగింది. ఇంతకీ, ఈ కథలో నటి సంగతి ఏంటి.? ఏమీ చెప్పదే.! ఆమె చెప్పదు సరే, రెండో పెళ్ళి ప్రచారం మాటేమిటి.? ఈసారి బంధువుతోనే పెళ్ళి.. అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయ్. నిజా నిజాల సంగతెలా వున్నా, ఆమె మాత్రం ఈ గాసిప్పుల్ని ఎంజాయ్ చేస్తోందిట. పబ్లిసిటీ ఊరకనే వస్తుందేంటి మరి.?