ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానుకు గత ఏడాది నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చెప్పిన రెండు రిలీజ్ డేట్స్ కూడా వెళ్లిపోయాయి. మొదట్లో జులై 31 అన్నారు. ఆ తరువాత సంక్రాంతి అన్నారు. ఒకసారి షూటింగ్ వల్ల క్యాన్సిల్ అయితే మరోసారి కరోనా దెబ్బ వల్ల వాయిదా వేశారు.
మొత్తానికి కరోనా వల్లే సినిమా వాయిదా పడేది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు అఫీషియల్ గా ఈ ఏడాది అక్టోబర్ 13న రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతా బాగానే ఉంది కాని సినిమాను అప్పుడు రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఏ మాత్రం ఇష్టపడటం లేదట. మొత్తానికి లెట్ అయితే అయ్యింది. ఇక 2022 జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తే బావుంటుందని అనుకుంటున్నారట.
రేపో మాపో డిస్ట్రిబ్యూటర్స్ అందరు నిర్మాతను కలవనున్నట్లు సమాచారం. సినిమా విడుదలకు మళ్ళీ వాయిదా వేస్తేనే బెటర్ అని ఆలోచిస్తున్నారట. అయితే ఇప్పటికే రెండు డేట్స్ మార్చిన రాజమౌళి మళ్ళీ మరో డేట్ అంటే కొత్త తలనొప్పి వచ్చినట్లే. ఇదేదో ముందే మాట్లాడుకొని డిసైడ్ అయితే బావుండేది. ఇప్పటికే ఆలస్యం కావడం వలన అభిమానులు కొంత అసంతృప్తితో ఉన్నారు. మరి జక్కన్న ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీలుకుంటాడో చూడాలి.