పూరి జగన్నాద్ హీరోయిన్లంటే టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చూస్తుంటారు. కుర్రకారు గుండెల్లోకి దూసుకుపోయేలా ఉంటారు పూరి హీరోయిన్లు. పూరి జగన్నాద్ పరిచయం చేసిన హీరోయిన్లు దాదాపు సక్సెస్ అయ్యారు. కానీ కొంతమంది మాత్రం లక్ కలిసి రాక కనుమరుగైపోయారు. అలా దిశా పటాని అనే హీరోయిన్ లోఫర్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ తెలుగులో మాత్రం ఫేమస్ కాలేదు.
దిశా పటాని బాలీవుడ్‌లో ఫుల్ ఫేమస్ అయింది. టైగర్ ష్రాఫ్ సరసన వరుసగా నటిస్తూ హిట్ల మీద హిట్లు కొట్టేసింది. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కంటే ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీకే సోషల్ మీడియా మొత్తం ఫిదా అయిపోయింది. ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కుతారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ చివరకు తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని సైడ్ అయ్యారు. అలా టైగర్ ష్రాఫ్‌తో నడిపిన ప్రేమాయణం దిశాను బాగానే పాపులర్ చేసింది.
ఇక దిశా ఇంతగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి మరో కారణం ఉంది. లోదుస్తుల కంపెనీ అయినా కెల్విన్ క్లైన్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం వింత వింత ఫోటో షూట్లతో నానా రచ్చ చేయడంతో మరింతగా పాపులర్ అయింది. ఘాటు అందాలను బికినీలో ప్రదర్శించడంతో నెట్టింట్లో కుంపటి పెట్టేది. తాజాగా దిషా తన అందాలను బయటపెట్టేసింది. ఆమె చేసిన క్లీవేజ్ షోకి నెటిజన్లకు మతులు పోతున్నాయి. ప్రస్తుతం దిషా ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.