పూరి జగన్నాథ్ హీరోయిన్లంటే తెలుగు ప్రేక్షకులకు ఓ రేంజ్ అంచనాలుంటాయి. పూరి హీరోయిన్లలో దాదాపు అందరూ తెలుగు ప్రేక్షకులకు ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. లోఫర్ చిత్రంతో టాలీవుడ్‌ను తన అందాలతో కట్టిపడేసింది దిషా పటానీ. అయితే దిషా మాత్రం టాలీవుడ్‌ను లైట్ తీసుకున్నట్టుంది. అందుకే బాలీవుడ్‌లో సెటిలైంది. బాలీవుడ్‌లో దిషా సినిమాల కంటే అఫైర్లతో బాగా ఫేమస్ అయింది.
టైగర్ ష్రాఫ్‌తో దిషా నడిపించిన ప్రేమాయణం ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఈ ఇద్దరూ ప్రేమ పక్షుల్లా విహరించడం చూసి..అందరూ పెళ్లి పీటలెక్కుతారని భావించారు. కానీ చివరకు తామిద్దరం కేవలం స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. అలా వీరి బంధానికి ముగింపు వచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ ఫ్రండ్స్‌లానే ఉంటున్నారు. అయితే దిషా సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతకు నెటిజన్లు పిచ్చెక్కిపోతుంటారు.
కాల్విన్ క్లైన్ అనే లోదుస్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా దిషా చేసే రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాట్ హాట్ ఫోటోలతో దిషా పటానీ రచ్చ చేస్తుంది. మరీ ముఖ్యంగా బీచ్‌లో బికినీ ఫోటోలు షేర్ చేస్తే నెట్టింట్లో అగ్గి పుట్టడం ఖాయం. తాజాగా రెడ్ బికినీలో ఇసుకలో తడి అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.