షాకింగ్ : “అవతార్ 2” కి డిజాస్టర్ వసూళ్లు అక్కడ.!

పాన్ వరల్డ్ అవైటెడ్ చిత్రం అవతార్ సీక్వెల్ అవతార్ పార్ట్ 2 కోసం ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అవతార్ 1 టార్గెట్ గా దర్శకుడు జేమ్స్ కామెరాన్ అండ్ టీం బరిలోకి దిగిన ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు కొల్లగొడుతుందా అని అందరిలో ఉండిపోయింది.

దీనితో ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై సాలిడ్ హైప్ వరల్డ్ వైడ్ ఉంది. అయితే ఇంత హైప్ ఉన్న సినిమాకి ఎక్కడైనా డిజాస్టర్ ఓపెనింగ్స్ తో వసూళ్లు వస్తాయని అనుకుంటారా? కానీ నిజంగానే అవతార్ కి ఫ్రాన్స్ దేశస్తులు షాకిచ్చారు. ఈ చిత్రం రెండు రోజులు ముందే అక్కడ రిలీజ్ అయ్యింది.

అంటే నిన్న డిసెంబర్ 14నే ఫ్రాన్స్ లో రిలీజ్ చేయగా కేవలం అక్కడ మొదటి రోజు 70 వేల డాలర్స్ కి పైగా మాత్రమే నమోదు అయ్యాయట. ఇది మాత్రం షాకింగ్ అని చెప్పాలి. అయితే దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ చిత్రం రిలీజ్ సమయానికి ఫ్రాన్స్ లో వారి దేశానికీ మరో దేశానికీ జరుగుతున్న మ్యాచ్ ఉండడంతో అయితే ఈ సినిమాకి షాకింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అలాగే ఇపుడు వరల్డ్ కప్ అందులోని సెమీ ఫైనల్ మ్యాచ్ కావడంతో ఫ్రాన్స్ దేశస్తులు సినిమాకి హ్యాండ్ ఇచ్చి ఫుట్ బాల్ కి జై కొట్టారు. దీనితో ఈ సినిమాకి డిజాస్టర్ వసూళ్లు వచ్చాయి. మరి రెండో రోజు నుంచి ఏమన్నా పెరుగుతాయో లేదో..