సెటైర్లు సరే.! సినిమా ఎప్పుడు హరీష్.!

పవన్ కళ్యాణ్ గెడ్డంలోని వెంట్రుకల గురించి కొంతమంది ఉచిత సలహాలిస్తున్నారట. అవునులెండి ఇది సోషల్ యుగం.. ఎవరైనా ఎలాగైనా కామెంట్ చేసుకోవచ్చు.. సోషల్ స్వాతంత్ర్యం అలా తగలబడింది మరి.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటారా.? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న సినిమా టైటిల్ మర్చిపోయారు. అదే సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ ఇష్యూ అయిపోయిందిప్పుడు. అయినా పవన్ కళ్యాణ్‌కి తాను చేస్తున్న సినిమా టైటిల్ మర్చిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది.?

అసలు ఆ సినిమా స్టేటస్ ఏంటీ.? రిలీజ్ ఎప్పుడు.? ఇలాంటి విషయాల్లో పవన్ అభిమానులకి పర్ఫెక్షన్ దొరకడం లేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఓ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ఈ సినిమా గురించిన ప్రస్థావన వస్తే.. వేదికపై ఈ సినిమా టైటిల్‌ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి బదులు ‘సర్ధార్ భగత్ సింగ్’ అని పలికారు. దాంతో నెటిజన్లు పట్టి లాగేస్తున్నారు.

అసలీ సినిమా షూటింగ్ ఎంతవరకూ వచ్చిందన్న అనుమానాలు అభిమానుల్లోనూ తలెత్తుతున్నాయ్. ఓ వైపు ‘ఓజీ’, మరోవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను ఒకేసారి పూర్తి చేసే పనిలో వున్నారు పవన్ కళ్యాణ్.

‘ఓజీ’ దాదాపు పూర్తయిపోయింది. కానీ, ‘ఉస్తాద్’ మాత్రం మొదటి నుంచీ ఆటంకాల్ని ఎదుర్కొంటూ వస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆధారపడి వుందీ సినిమా భవిష్యత్తు. ఏళ్ల తరబడి ఈ సినిమా కోసం నిరీక్షిస్తున్నాడు హరీష్ శంకర్.

ఈ సినిమా విషయలో తనపై వస్తున్న ఒత్తిడిని సెటైర్ల రూపంలో తీర్చుకుంటున్నాడు హరీష్ శంకర్. అయితే కొన్నిసార్లు అవి బెడిసికొట్టేస్తున్నాయ్. అందుకే, సెటైర్లు వేసే ముందు కాస్త ఆలోచించుకో.. అంటూ హరీష్ శంకర్‌కి అత్యంత సన్నిహితుడైన ఓ దర్శకుడు ఉచిత సలహా ఇచ్చాడట.