కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్ దొరికితే దర్శక, నిర్మాతలు ఎంత అదృష్ఠవంతులో ..!

కాజల్ అగర్వాల్ ఈ నెల 30 న పెళ్ళిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్ళి పనులు కూడా ప్రారంభం అయ్యాయట. ముంబై లోని స్టార్ హోటల్ లో కాజల్ వివాహం రెండు రోజుల వేడుకగా అత్యంత వైభవంగా జరగబోతుంది. ఇక కాజల్ వివాహానికి కుటుంబ సభ్యుల తో పాటు స్నేహితులు, సినిమా సెలబ్రిటీలు హాజరవనున్నారు.

Kajal Aggarwal shares first photos with her fiancé Gautam Kitchlu | The  News Minute

అయితే ఎప్పుడైతే కాజల్ అగర్వాల్ తన పెళ్ళి విషయాన్ని బయట పెట్టిందో అప్పటి నుంచి చాలామందిలో రకరకాల సందేహాలున్నాయి. ఆ సందేహాలన్ని తను ఇప్పటి వరకు కమిటయిన తెలుగు తమిళ సినిమాల విషయంలోనే. లేదు లేదు అంటూనే కాజల్ చేతిలో పాన్ ఇండియన్ సినిమాలు చాలానే ఉన్నాయి.

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం కంప్లీటయింది. అలాగే కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మంచు మోహన్ విష్ణు నటిస్తున్న మోసగాళ్ళు సినిమాలో కూడా విష్ణు కి సోదరిగా నటిస్తుంది.

ఈ సినిమాలన్ని పాన్ ఇండియన్ సినిమాలు. వీటితో పాటు హిందీ సినిమా కూడా ఒకటి చేస్తోంది. అయితే కాజల్ పెళ్ళి చేసుకోబోతున్న కారణంగా ఈ సినిమాలన్ని ఇప్పట్లో కంప్లీట్ చేసేందుకు కాజల్ చాలా సమయం తీసుకుంటుందని భావించారు. కాని కాజల్ మాత్రం దర్శక నిర్మాతలకి ఇబ్బంది కలగకుండా కమిటయిన సినిమాలన్ని సకాలంలో పూర్తి చేస్తుందట. పెళ్ళి జరిగినా కూడా ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవనుందని తెలుస్తుంది. ఈ రకంగా చూస్తే కాజల్ లాంటి హీరోయిన్ దర్శక, నిర్మాతలకి దొరకడం అదృష్ఠమే అని చెప్పాలి.