‘ఖుషి’ ఎఫెక్ట్.! శివ నిర్వాణలో జోరు తగ్గిందా.?

‘ఖుషి’ సినిమాపై కొండంత ఆశలు పెట్టుకున్నాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ప్రమోషన్లు బాగా చేశారు. సినిమా ఓపెనింగ్స్‌కి అవి బాగా యూజ్ అయ్యాయ్ కూడా. కానీ, ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, ఆ తర్వాత అంచెలంచెలుగా ‘ఖుషి’ డౌన్ ఫాల్ మొదలయ్యింది.

హిట్టు సినిమా అన్నది కాస్తా.. డిజాస్టర్ అంటూ టాక్ స్ర్పెడ్ అయ్యింది. అలా డైరెక్టర్ శివ నిర్వాణ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయ్. ‘ఖుషి’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీయాలనుకున్నాడు శివ నిర్వాణ.

అందుకోసం కథ కూడా రెడీ చేసుకున్నాడు. ‘ఖుషి’ రిజల్ట్ చూసి రామ్ చరణ్‌ని అప్రోచ్ అవ్వాలనుకున్నాడట. కానీ, రివర్స్ అయ్యిందంతా. దాంతో, శివ నిర్వాణ మనసు మార్చుకోవల్సి వచ్చింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్ చరణ్‌కి తన కథ వినిపించడం కరెక్ట్ కాదనుకున్నాడో ఏమో, కానీ, మెగా కాంపౌండ్‌లోని మరో హీరోని ట్రై చేస్తున్నాడట.

సాయి ధరమ్ తేజ్ కానీ, వైష్ణవ్ తేజ్ కానీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అయినా సరే, తన కథతో ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాడట శివ నిర్వాణ. త్వరలోనే ఈ మెగా అప్డేట్ శివ నిర్వాణ నుంచి వస్తుందని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం వైష్ణవ్ తేజ్‌తో ఈ కథ ఓకే చేసుకోవాలనుకుంటున్నాడనీ తెలుస్తోంది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ సినిమాతో బిజీగా వున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. చూడాలి మరి, శివ నిర్వాణ సబ్జెక్ట్‌లోకి వైష్ణవ్ తేజ్ వస్తాడా.? లేదంటే మరే మెగా హీరో వచ్చి చేరబోతున్నాడో.!