Dhanush – Shekar Kammula: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న చిత్రం కుబేర. ఈ కాంబినేషన్ అనూహ్యంగా, ప్రేక్షకులలో భారీ ఆసక్తిని కలిగించింది. తెలుగులో సున్నితమైన ప్రేమకథలు చెప్పడంలో పేరు పొందిన కమ్ముల, తమిళ స్టార్ ధనుష్‌తో సినిమా చేస్తారు అనుకోవడం చాలా మందికి ఆశ్చర్యకరమే. ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే, ఇది కమ్ముల స్టైల్ కు ధనుష్ ఇమేజ్ కు కలిపిన విభిన్న ప్రయత్నంగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో ధనుష్ బిలియనీర్ పాత్రలో కనిపిస్తూనే బిచ్చగాడిగా మలుపు తీసుకుంటాడు. ఇలా స్టార్ హీరోగా ఉన్న ధనుష్, బిచ్చగాడి పాత్ర చేయడం ఆశ్చర్యకరమే. ఈ పాత్ర గురించి చెప్పడం కష్టంగా అనిపించిందని కమ్ముల తెలిపారు. ధనుష్‌కు కథ చెప్పేందుకు ఫోన్ చేసినప్పుడు, అతను నేను తీసిన సినిమాల గురించి చెప్పడం ఆశ్చర్యపరిచింది, అసలు నన్ను మొదట గుర్తుపడతారో లేదో అనుకున్నా. కానీ ఆయన నా సినిమాలోని సీన్స్ గురించి చెప్పడం విని నేను షాక్ అయ్యాను. ఈ ప్రాజెక్ట్ పట్ల ధనుష్ చూపిన ఆసక్తి తనకు ప్రోత్సాహమిచ్చిందని దర్శకుడు కమ్ముల వెల్లడించారు.
ఈ సినిమాలో రష్మిక మందన్నా పక్కింటి అమ్మాయిగా కనిపించబోతోంది. ధనుష్-రష్మిక జంట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని కమ్ముల చెప్పాడు. రష్మిక తన షెడ్యూల్‌ను బిజీగా ఉంచుకున్నప్పటికీ, హైదరాబాద్ వచ్చి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొనడం తన బాధ్యతాభిమానం చూపుతుందన్నారు. ఈ సినిమా కథలో బిచ్చగాడి పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో, ధనుష్ కమ్ముల శైలిని, తన నటనను ఉపయోగించి పాత్రకు న్యాయం చేశారు. ఒకవైపు కమర్షియల్ అంశాలు, మరోవైపు భావోద్వేగ భరితమైన కథతో కుబేర సినిమా రూపొందుతోందని తెలుస్తోంది.