ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కథలను తెరకెక్కించడంలో ముందుండే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన హిట్ సినిమాల్లో ‘హ్యాపీడేస్’ ఒకటి. 2007 అక్టోబరులో విడుదలైన ఈ చిత్రం రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శేఖర్ విూడియాతో ముచ్చటించారు. ‘హ్యాపీడేస్’, ’లీడర్’ సీక్వెల్స్‌పై స్పందించారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘కుబేర’ కబుర్లు చెప్పారు. ఎన్నిసార్లు చూసినా ‘హ్యాపీడేస్’ బోర్ కొట్టదు.
ఎప్పుడూ తాజాగానే ఉంటుంది. దానికి సీక్వెల్ చేయాలని నాకూ అనిపించింది. కానీ, కథ కుదర్లేదు.’లీడర్’కు కొనసాగింపు చిత్రం తెరకెక్కించాలనే ఆలోచన ఉంది. ఒకవేళ చేస్తే మళ్లీ రానాతోనే చేస్తా. సమయం పడుతుంది. ఆ సినిమాలో రూ. లక్ష కోట్ల అవినీతి గురించి చర్చిస్తే కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. సీక్వెల్‌ను రానాతోనే చేయాలి. కొత్తవారితో ప్రయత్నిస్తే దెబ్బతింటాం అని పేర్కొన్నారు. ధనుష్, నాగార్జునతో తెరకెక్కిస్తున్న’కుబేర’ పెద్ద సినిమా. నేను రాసుకున్న కథ, అందులోని పాత్రలకు వీరు సెట్ అవుతారనే ఎంపిక చేశా. కాపీ కథలను నేను తెరకెక్కించను. ఓ కథాలోచన రావడం, అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. నేను కథ సిద్ధంగా చేసుకోవడంలో నెమ్మదిగా వ్యవహరించినా. మేకింగ్ పరంగా మాత్రం ఫాస్ట్‌గా ఉంటా‘ అని తెలిపారు.