Rashmika: ఐటమ్ సాంగ్ అనుకున్నారు… కానీ హీరోయిన్ ఛాన్స్ నే కొట్టేసిన రష్మిక..?

Rashmika: రష్మిక మందన ఇప్పుడు నేషనల్ క్రష్ గా బాగా పాపులర్. ఈ కన్నడ ముద్దు గుమ్మా ఛలో సినిమా తో నాగశౌర్యా సరసన నటించి ఈ సినిమా విజయం తో వెను తిరిగి చూసుకునే పనిలేకుండా అయింది. తర్వాత విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమా తో నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. తర్వాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో టాప్ హీరోయిన్ అయిపోయింది.రీసెంట్ గా వచ్చిన పుష్ప తో ఆల్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ డమ్ పెంచుకుంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీగా ఉంది.

బాలీవుడ్‌ చిత్రం ‘ఎనిమల్‌’లో రష్మిక మందన్నా ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తున్నట్లు కొద్ది రోజులగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటికి దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ వార్తలపై టీ-సిరీస్‌ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అర్జున్‌ రెడ్డి ఫేం, తెలుగు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ఎనిమల్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్‌, డైరెక్టర్‌ సందీప్‌ వంగ అధికారిక ప్రకనట ఇచ్చారు.

సందీప్‌ వంగ ట్వీట్‌ చేస్తూ.. ‘అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రష్మిక మందన్నాకు ఎనిమల్‌కు టీం స్వాగతం. ఇందులో రష్మిక.. గీతాంజలి పాత్ర పోషించనుంది’ అని తెలిపాడు.యాక్షన్‌, రొమాంటిక్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ మూవీలో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సమ్మర్‌ సెట్స్‌పై రానున్న ఎనిమల్‌ వచ్చే ఏడాది 2023 అగష్టు 11న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.