కలర్ ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్, హీరోయిన్ చాందిని రావులు తిరుమల వేదికగా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.
షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టిన సందీప్ చాయ్ బిస్కెట్ షార్ట్ ఫిలిం తో భారీ పాపులర్ అందుకున్నారు. ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో దర్శకుడుగా మారి మొదటి సినిమాతోనే జాతీయ అవార్డ్ నిజంగా గ్రేట్. ఇక చాందినీరావు సందీప్ డైరెక్ట్ చేసిన కలర్ ఫోటో సినిమాలో ఒక కీలక పాత్రలో మెరిసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా సందీప్ రాజ్ కథ అందించిన హెడ్స్ అండ్ టైల్స్ వెబ్ సిరీస్ లో కూడా ఒక పాత్ర చేసింది. రణస్థలి తో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా కనిపించింది ఈ అందాల తార.
గత నెల 11వ తేదీన సందీప్ చాందిని రావుల నిశ్చితార్థం ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఈ జంటకి పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు నిటిజన్లు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు డిసెంబర్ 7న తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వీరి పెళ్లి వేడుకకు కలర్ ఫోటో సినిమా హీరో సుహాస్ సతీ సమేతంగా హాజరయ్యారు. అలాగే వైవాహర్ష, రోషన్ తదితరులు కూడా ఈ వివాహానికి హాజరై నూతన జంటకు తమ శుభాకాంక్షలు అందించారు.
సందీప్ ప్రస్తుతం రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా మోగ్లీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక వీరి పెళ్లి సందర్భంగా గతంలో సందీప్ తన ప్రేయసి చాందిని రావు పుట్టినరోజుకి పూర్తి చేసిన బర్త్డే విషెస్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. పోస్ట్ కింద కూడా పెళ్లి గురించి సంబంధించిన కామెంట్లు ఉన్నాయి అంటే ఆపట్నుంచే వీరి డేటింగ్, ప్రేమాయణం కంటిన్యూ చేస్తున్నారన్నమాట అనుకుంటూ వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తున్నారు నెటిజన్స్.