” జనగణమన ” ప్రాజెక్ట్ ఉంది కాని ఆ స్టార్ హీరో మాత్రం చేయడం లేదన్న పూరి ..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి దిట్టమైన హీరో కనిపించాలే కాని ఆ హీరో కోసం కథ రాసి సినిమా తీసేస్తాడు. ఇడియట్ సినిమాని ముందు కన్నడ లో తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాతే రవితేజ తో తీసి సూపర్ హిట్ కొట్టాడు. పూరి కి హీరో క్లాస్ గా ఉంటే నచ్చదు. మాసీగా ఉండాలి. మహేష్ బాబు లాంటి హీరోని కూడా పోకిరి గా మార్చేస్తాడు. బాలయ్య తో పైసా వసూల్ చేయిస్తాడు. హీరోని రోగ్ లా చూపించాలన్నా, లోఫర్ గా చూపించాలన్నా పూరి తర్వాతే. ఒక హీరోకి పది సినిమాలలో చేసినా రాని మాస్ ఇమేజ్ పూరి దర్శకత్వంలో ఒక్క సినిమా చేస్తే వచ్చేస్తుంది.

Puri Jagannadh inks fancy deal

అందుకోసమే అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్ సహా బాలయ్య లాంటి వాళ్ళు పూరి తో కథ వినకుండానే డేట్స్ ఇచ్చేస్తారు. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా పూరి కథ నరేట్ చేసే విధానానికి ఫ్లాటయ్యారు. పూరి కి భాష తో సంబంధం లేదు. హిట్ కొట్టడమే టార్గెట్. కొన్ని సార్లు అంచనాలు తప్పాయేమో గాని సినిమా మాత్రం తృప్తినిస్తుంది అని చాలా సందర్భాలలో హీరోలే చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతుంది. పూరి స్వయంగా నిర్మిస్తునాడు. ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ అందుకున్న పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని పాన్ ఇండియన్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు.

కాగా పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ లో కథలు రాసిన పూరి వాటిని స్టార్స్ తో తీయాలని ప్లాన్స్ వేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో పూరి ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆ సినిమా పూరి మహేష్ బాబు తో చేయాలనుకున్న ” జనగణమన ” అని ప్రచారం జరుగుతోంది. అయితే యష్ తో పూరి ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్.. కాని అది ” జనగణమన ” మాత్రం కాదని తెలుస్తుంది. ఇక యష్ తో పూరి చేసే సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందిస్తాడని సమాచారం.