KGF 3: దర్శకుడు ఏమన్నాడంటే? 

KGF 2 teaser on 29th July

ఒక కన్నడ సినిమా ఇండియా వైడ్ గా బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందని ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు చూపు కూడా చాఫ్టర్ 2 పైనే ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాకు సంబందించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి, ముఖ్యంగా సినిమాకు కొనసాగింపుగా మరో కథ కూడా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో చాఫ్టర్ 3 పేరుతో కొన్ని ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ పుట్టుకొస్తున్నాయి. 


ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా సినిమాకు సంబందించిన కొన్ని తెలుగు పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. అయిత్ ఫైనల్ గా దర్శకుడు ఆ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. సినిమాకు కొనసాగింపుగా అయితే మరో స్క్రిప్ట్ అనుకోలేదు. చాఫ్టర్ 2 లోనే అసలు కథ ఎండ్ అవుతుందని అన్నాడు, ఒక వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఈ విషయాన్నీ తెలియజేశాడు. దీంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది. 

ఇక KGF 2 గురించి మాట్లాడిన దర్శకుడు ఫస్ట్ పార్ట్  లో కంటే ఎక్కువా హైప్ తెచ్చే సన్నివేశాలు చాలానే ఉంటాయట, ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. సినిమాలో హీరో యష్ పాత్ర కూడా ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందని చెబుతున్నాడు. మరి సినిమా అభిమానులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ ప్రాజెక్టు అనంతరం ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.