డైరెక్టర్ మారుతి అనేవాడు మెగా కాంపౌండ్‌కు చెందిన వాడన్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా, అల్లు ఫ్యామిలీతో మారుతి ఉంటాడు. వారి దగ్గర పని చేస్తూనే ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చానని ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు మారుతి . తాజాగా తన సినీ ప్రయాణం ఎలా మొదలైంది.. ఏ చిత్రంతో మొదటి అడుగు పడిందో చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మారుతి విష్ చేశాడు. ఇక పవర్ స్టార్ తనకు విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ట్వీట్లు చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా తిరిగి రిప్లై ఇస్తున్నాడు. ఈ క్రమంలో మారుతికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చాడు. డియర్ మారుతి గారు.. మీ విషెస్‌కు థ్యాంక్స్.. మీ భవిష్యత్తు చిత్రాలన్నీ బాగుండాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా మారుతి స్పందిస్తూ.. గతంలోకి వెళ్లాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిపైకు మారుతి స్పందిస్తూ.. థ్యాంక్యూ కళ్యాణ్ గారూ.. తెలుగు చిత్రసీమలో నా సినిమా ప్రయాణం మొదలైందే మెగా ఫ్యామిలీతో. జానీ సినిమాకు లోగో క్రియేట్ చేయడమే టాలీవుడ్‌లో నా మొదటి పని. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు.. నా లక్కీ చార్మ్ మీరు.. ఇంకా మమ్మల్ని ఇలానే ఇన్‌స్పైర్ చేస్తూనే ఉండాలి సర్.. లవ్యూ ఫరెవర్ అంటూ తన సినీ ప్రయాణం గురించి మారుతి చెప్పుకొచ్చాడు.