Lokesh kanagaraj: లోకేష్ డ్రీమ్ కాంబో ప్లాన్: ఒకే ఫ్రేమ్‌లో టాప్ లెజెండ్స్?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మొత్తం సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో మోస్ట్ అంబీషస్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే లోకేష్ కనగరాజ్ పేరు ముందే వస్తుంది. తన యాక్షన్ థ్రిల్లర్లతో స్టార్ హీరోల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ యువ దర్శకుడు ఇప్పుడు ఒక పెద్ద కలను నిజం చేయాలనుకుంటున్నాడు. అది కూడా నాలుగు దశాబ్దాల తర్వాత… రజనీకాంత్, కమల్ హాసన్ లను ఒక్కటే తెరపై చూపించాలన్న లక్ష్యంతో.

ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో లోకేష్ ఇచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ గ్యాంగ్ స్టర్లుగా కనిపించే కథను సిద్ధం చేస్తానని చెప్పిన లోకేష్, వీరి కలయికకు కమిట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. సెట్టయితే ఇది ఇప్పటి తరానికి ఇది ఒక డ్రీమ్ కాంబో. చివరిసారిగా ఈ ఇద్దరూ 1985లో బాలీవుడ్‌లో విడుదలైన ‘గిరఫ్తార్’ సినిమాలో కలిసి నటించగా, అంతకు ముందు దాదాపు పదిహేను సినిమాలు చేసారు.

ఇకపోతే ఈ ప్రయోగం ఎందుకు అంత స్పెషల్‌గా మారనుందంటే… ప్రస్తుతం రజనీ, కమల్ ఇద్దరూ తాము ఎంచుకునే సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నారు. వయసు కూడా పెరిగిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సాధ్యం కావడం సాధారణ విషయం కాదు. కానీ లోకేష్ బరువైన కథ, డెప్త్ ఉన్న పాత్రలతో వస్తే మాత్రం ఇద్దరూ ఓకే చేయొచ్చన్న ఊహలే ఉన్నాయి. లోకేష్ ప్రస్తుతం ఖైదీ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత రోలెక్స్, విక్రమ్ 2, లియో 2 చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. వీటిలో రోలెక్స్ స్టాండ్ అలోన్ మూవీగా రెడీ అవుతుందని సమాచారం. కమల్‌తో చేసిన విక్రమ్ విజయంతో అతని స్థాయి పెరిగింది. ఇక రజనీకాంత్‌తో చేసిన జైలర్ ఫ్లేవర్ ఉన్న కూలీ ఫిల్మ్ కూడా బోర్డ్ మీదే ఉంది.

ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఎనౌన్స్ అయితే మాత్రం, ఇది కోలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిలో అతి పెద్ద మల్టీ స్టారర్‌గా నిలిచే చాన్స్ ఉంది. ప్రస్తుతం ఇది కేవలం ఇంటర్వ్యూలో వచ్చిన పాయింట్ అయినా, లోకేష్ ట్రాక్ రికార్డు చూస్తే ఇది త్వరలోనే ఓ పక్కా ప్రాజెక్ట్‌గా మారొచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

పోలవరం నిధులు డైవర్ట్ || Analyst Ks Prasad EXPOSED Polavaram Money Divert || Chandrababu || TR