‘శాకుంతలం’ విషయంలో తొందరపడుతున్న గుణశేఖర్ !

director gunasekhar speed up the pre production work for shakuntalam movie

డైరెక్టర్ గుణశేఖర్ ఇటీవల ‘శాకుంతలం’ అనే ఓ పౌరాణిక చిత్రాన్ని రూపోందిస్తున్నట్లు ప్రకటించి అందరిలోనూ ఆసక్తిని పెంచారాయన. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుందని సమాచారం. గుణశేఖర్ తన సినిమాల్లో సెట్స్ మీద ప్రత్యేక ద్రుష్టి పెడతారు. ఒక్కడు సినిమాలో చార్మినార్, అర్జున్ లో మీనాక్షమ్మ దేవాలయం, సైనికుడు లో ఫారెస్ట్ బ్రిడ్జి, వరుడు మూవీలో పెళ్లి మండపం, రుద్రమదేవిలో రకరకాల కోటలు ఇలా ఆయన తీసిన ప్రతి సినిమాలో భారీ సెట్స్ కనువిందు చేస్తాయి. ఈ మూవీలో కూడా భారీ సెట్స్ ఉన్నాయట.

director gunasekhar speed up the pre production works for shakuntalam movie

అలానే ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా ప్రాధాన్యత ఉందని, మణిశర్మ ఇప్పటికే అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చే పనిలో నిమగ్నమైయ్యారని తెలుస్తుంది. గతంలో గుణశేఖర్ – మణిశర్మ కాంబినేషన్లో చాలా హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ వచ్చాయి. గుణశేఖర్ కూతురు నీలిమ ‘గుణ టీమ్ వర్క్స్’ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో శకుంతలగా ‘అక్కినేని సమంత’ నటించనుంది. శకుంతల విరహానికీ, బాధకీ కారణమైన దుష్యంతుడి రోల్‌కి ఎవరిని తీసుకుంటారనే దాని మీద స్పష్టత రాలేదు. గుణశేఖర్ ఈ చిత్రానికి సంబంధించిన పనులను శరవేగంగా చేస్తున్నారని సినీ వర్గాల నుండి సమాచారం. చాలా కాలం తర్వాత గుణ శేఖర్ నుంచి వస్తున్న ఈ చిత్రంతో ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరిదశలో ఈ సినిమా విడుదల చేయాలని దర్శకుడు అనుకుంటున్నారని సమాచారం.