నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇటీవల ఓ క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారసుడ్ని పరిచయం చేసే డైరెక్టర్ ఎవరా.? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అనిల్ రావిపూడినే మోక్షజ్ఞ తెరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్నాడనీ తెలుస్తోంది.
ఆల్రెడీ బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా షూటింగ్‌లోనే కొన్ని షాట్స్ మోక్షజ్ఞపైనా షూట్ చేశాడట రీసెంట్‌గా అనిల్ రావిపూడి. అలాగే యాక్టింగ్ స్కిల్స్‌లోనూ హ్యూమరస్‌లోనూ ట్రైనింగ్ ఇస్తున్నాడట.
హ్యూమరస్ అనేది నటుడికి చాలా ఇంపార్టెంట్. అందులో అనిల్ రావిపూడిది అందె వేసిన చేయి. అందుకే ఈ తరహా ట్రైనింగ్స్‌తో మోక్షజ్ఞను షైన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. ‘భగవంత్ కేసరి’ సినిమా రిలీజ్ అయ్యే లోపే మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో అధికారిక ప్రకటన రానుందనీ తెలుస్తోంది.