బాబీ మళ్ళీ రెడీ అవుతున్నాడట.!

‘వాల్తేరు వీరయ్య’ సినిమా టీమ్ రీ-యూనియన్ నిర్వహించింది. 200 రోజుల ఈవెంట్ అంటూ.. ఓసారి, ఆ చిత్ర యూనిట్ అంతా ఇంకోసారి సందడి చేసింది.

సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ అనూహ్యమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రివ్యూలు చాలా బ్యాడ్.. కాదు కాదు, వరస్ట్‌గా వస్తే, సినిమా మాత్రం ఘనవిజయాన్ని చవిచూసింది.

చిరంజీవి – రవితేజ కలిసి నటించారు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో. ఆ కాంబినేషన్ ఇంకోసారి ఎప్పుడు రిపీట్ అవుతుంది.? అన్న ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకనుందట. ‘ఈసారి పూర్తిస్థాయి ఎంటర్టైనర్.. ఫుల్ లెంగ్త్ మేమిద్దరం తెరపై కన్పించాలి..’ అని రవితేజ, బాబీకి గతంలోనే సూచించాడు. ఆ దిశగా బాబీ అప్పుడే పని మొదలు పెట్టేశాడట.

చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ కథకి మెరుగులు దిద్దాలనుకుంటున్నాడట కూడా. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి వుంది. ఆ తర్వాత వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తారు. మరి, బాబీ సంగతేంటో.!