అనీల్ రావిపూడి .. బ్యాడ్ న్యూస్ చెప్పినట్టా – గుడ్ న్యూస్ చెప్పినట్టా?

ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్ 3తో దూసుకొస్తామ‌న్న అనిల్ రావిపూడి ఆ ప‌నిలో బిజీగా ఉన్నాడా? హీరో .. ద‌ర్శ‌కుడు కోవిడ్ వల్ల ఏదీ తేల్చ‌క‌ వెయిటింగ్.. ఎఫ్ 2 సీక్వెల్ పై రావిపూడి బ్యాడ్ న్యూస్ చెప్పినట్టా – గుడ్ న్యూస్ చెప్పినట్టా ?

anil ravipudi f3 plans
anil ravipudi f3 plans

సైలెంట్ గా వ‌రుస హిట్ల‌తో స్టార్ డైరెక్ట‌ర్ల లీగ్ లో చేరాడు అనీల్ రావిపూడి. 2019 సంక్రాంతికి `ఎఫ్2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్` సంక్రాంతి బరిలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. 2020 సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించింది. వ‌రుస‌గా సంక్రాంతి బ‌రిలో హిట్లు కొడుతున్నాడు కాబ‌ట్టి మ‌రోసారి సంక్రాంతి కానుక‌గా సీక్వెల్ సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? అంటే..

గ‌త కొంత‌కాలంగా ఎఫ్ 2 సీక్వెల్ కోసం అత‌డి టీమ్ స్క్రిప్టు ప‌నిలో బిజీగా ఉంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఎఫ్ 2 ని మించి ఎఫ్ 3 ట్రిపుల్ కామెడీ ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం రైట‌ర్లు గ‌ట్టిగానే ప‌ని చేస్తున్నారు. ఎఫ్ 2తో పోలిస్తే స‌రిలేరు నీకెవ్వ‌రు కామెడీ ప‌రంగా ఫెయిలైంద‌న్న విమ‌ర్శ‌లొచ్చాయి కాబ‌ట్టి అది రిపీట్ కాకుండా జాగ్ర‌త్త‌గా స‌న్నివేశాల్ని ప్రిపేర్ చేస్తున్నార‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం కోవిడ్ వ‌ల్ల వెంకీ కానీ అనీల్ రావిపూడి కానీ సెట్స్ కెళ్లే ఆలోచ‌న‌లో లేరు. నారప్ప చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైంది. ఈ మూవీ షూటింగ్ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి పూర్త‌యినా ఆ త‌ర్వాతే రిలీజ్ ఉంటుంది. ఈలోగానే అనీల్ రావిపూడితో క‌లిసి ఎఫ్ 3 స్క్రిప్టును డిస్కస్ చేసే వీలుంటుంద‌ని తెలిసింది. వెంకీతో పాటు వ‌రుణ్ తేజ్ వేర్వేరు సినిమాల‌తో బిజీగా ఉన్నారు.