కాంట్రవర్సీ పై ఓపెన్ అయ్యిన దిల్ రాజు.!

Dil Raju

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో ఒకరైనటువంటి దిల్ రాజు ఇప్పుడు తమిళ్ సహా పలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండగా ఈ చిత్రాల్లో తమిళ స్టార్ నటుడు విజయ్ తో “వారసుడు” అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా మాసివ్ రిలీజ్ కోసం తాను గట్టిగా కష్టపడుతున్నాడు.

దీనితో దిల్ రాజు లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున రచ్చ లేపాయి. అజిత్ కన్నా విజయ్ సినిమానే ఎక్కువ అని అందుకే నాకే ఎక్కువ థియేటర్స్ కావాలని అడుగుతానని చెప్పారు. కానీ అనూహ్యంగా ఈ కాంట్రవర్సీ పై దిల్ రాజు లేటెస్ట్ క్లారిటీ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

మరి తాను మాట్లాడుతూ నేను మొత్తం 45 నిముషాలు ఇంటర్వ్యూ ఇస్తే అందులో కేవలం కొన్ని సెకండ్స్ బిట్ ని కట్ చేసి వైరల్ చేసారని అందుకే మీడియా లో ఏం మాట్లాడాలన్నా భయంగా ఉందని తెలిపారు. ఆ ఇంటర్వ్యూ లో మొత్తం 20 ప్రశ్నలకు పైగా ఉన్నాయి అందులో నేనెవరినీ తగ్గించలేదు ఎవరినీ మొయ్యలేదు. 

ఆ ఇంటర్వ్యూ అంతా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది అని ఏది పూర్తిగా తెలియకుండా మాట్లాడొద్దని అయితే దిల్ రాజు తెలిపారు. దీనితో తమిళ మీడియా సహా తెలుగు సినిమా మీడియాలో కూడా తన కామెంట్స్ వైరల్ గా మారాయి. 
https://twitter.com/rameshlaus/status/1603956316451786755