Dil Raju: తాత అయ్యాక మరోసారి తండ్రి కాబోతున్న దిల్ రాజు… శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్లు?

Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రొడ్యూసర్ గా తెలుగు సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు కూడా నిర్మాతగా మారిపోయారు. ఈ విధంగా నిర్మాణ సంస్థలో ప్రొడ్యూసర్ దిల్ రాజుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిల్ రాజు తన మొదటి భార్య శిరీష మృతి చెందిన తర్వాత రెండు సంవత్సరాలకు రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా తన భార్య మరణించడంతో ఒంటరిగా కుమిలిపోతున్న దిల్ రాజు బాధను చూసి తట్టుకోలేక తన కూతురు హన్షిత తన తండ్రికి రెండవ వివాహం జరిపించారు.అయితే అప్పటికే తన కూతురికి పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇలా కూతురు పెళ్లి చేసి తాతగా ప్రమోట్ అయిన దిల్ రాజు తిరిగి ఐదు పదుల వయసులో రెండవ వివాహం చేసుకోవడంతో గతంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇలా తేజస్వినిని(వైఘా రెడ్డి) రెండవ వివాహం చేసుకున్నారు.

తాజాగా దిల్ రాజు కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పటికే తాత గా ప్రమోట్ అయిన దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారు అంటూ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి దిల్ రాజు కుటుంబం ఏ విధంగా స్పందించకపోయినప్పటికీ ఈ విషయం మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్దఎత్తున నెటిజన్లు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే దిల్ రాజు గురించి వస్తున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాలంటే ఈ విషయంపై దిల్ రాజు స్పందించాల్సి ఉంది.