Dil Raju : భాలీవుడ్ లో భంగపాటు.. మొదటి సినిమాతో నిరాశ పడిన దిల్ రాజు….!

Dil Raju : సినిమా డిస్ట్రిబ్యూషన్ తో మొదలుపెట్టిన సినీ ప్రస్థానం సక్సెస్ ఫుల్ నిర్మాతగా మారి బడా ప్రొడ్యూసర్స్ జాబితాలోకి చేరాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ చేసిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచాయి. మరికొన్ని మినిమం గ్యారంటీగా నిలిచాయి. ఇక దిల్ రాజు ఈ మధ్యనే అఖండ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ తో బాగా లాభపడిన రాజు, ఆ తర్వాత వచ్చిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ తో 100కోట్లు లాభాలు తెచ్చుకున్నారు. ఇది నైజాం ఏరియాలో ఆల్ టైం రికార్డు.

ఇక ఈ ఉత్సాహంతోనే దిల్ రాజు బాలీవుడ్ లో నిర్మాతగా మారాలనే ఉద్దేశ్యం తో తెలుగులో మంచి హిట్ అందుకున్న నాని నటించిన జెర్సీ సినిమాను హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఈ సినిమా కంటే ముందు షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశించి దిల్ రాజు బాలీవుడ్ లో అడుగేశారు. సినిమా బాగుంది షాహిద్ నటన అందరికి నచ్చింది, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం బాగుందని టాక్ వచ్చింది కానీ సినిమా మాత్రం వసూళ్లు రాబట్టడం లేదు.

కారణం కేజీఎఫ్ 2 సినిమానే. కేజీఎఫ్ 2 సినిమా క్రేజ్ ఇంకా బాలీవుడ్ లో తగ్గలేదు దీని ప్రభావం జెర్సీ కలెక్షన్స్ పై పడింది. నిజానికి జెర్సీ సినిమా పోయిన వారమే విడుదలవ్వాల్సి ఉన్నా కేజీఎఫ్ 2 క్రేజ ముందు నిలబడదని విడుదల వాయిదా వేశారు. కానీ ఈ వారం కూడా ఇలా జరుగుతుందని దిల్ రాజు ఊహించలేదు. అలా బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే భంగపాటుకు గురయ్యారు.