పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న సినిమా “వకీల్ సాబ్”. ఇప్పటికే ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాలలో వకీల్ సాబ్ మీద అంచనాలు స్కై రేంజ్ లో ఉన్నాయి. ఇక థియోటర్స్ లో పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా చూడాలని జనాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా అయితే వకీల్ సాబ్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియకపోవడంతో వకీల్ సాబ్ రిలీజ్ విషయంలో తరచూ రక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేసే అవకాశం ఇప్పట్లో లేదని అందరూ భావిస్తున్నారు. ఈ కారణంగానే మంచి కంటెంట్.. అలాగే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న సినిమాలకి అమెజాన్ ఫ్రైం లాంటి ఓటిటి సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మించిన వి సినిమా రీసెంట్ గా ఓటీటిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే “వకీల్ సాబ్” కు తెలుగులో ఏ సినిమాకు ఇవ్వని భారీ ఆఫర్ ను ఇచ్చారని తెలుస్తుంది.
అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఆ ఆఫర్ ని నిర్మొహమాటంగా వదిలేశారని సమాచారం. అందుకు కారణం దిల్ రాజు కి పవర్ స్టార్ అంటే విపరీతమైన అభిమానం. చెప్పాలంటే నిర్మాతగా కాకుండా ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని నిర్మించాడు. అంతేకాదు వసూళ్ళ విషయంలో పవన్ కళ్యాణ్ స్టామినాని, క్రేజ్ ని గుడ్డిగా నమ్మి ఉన్నాడు. అందుకే దాదాపు 100 కోట్ల ఆఫర్ ఓటీటీ సంస్థ చేసినప్పటికి రిజెక్ట్ చేశాడు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నప్పటికి కొంతమంది మాత్రం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బంగారం లాంటి ఆఫర్ ని కాదని దిల్ రాజు పొరపాటు చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారట.