శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియన్ సినిమా అనౌన్స్ చేసిన దిల్ రాజు..!

శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో .. ఇండస్ట్రీ వర్గాలలో భారీగా న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా చెప్పాలంటే ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ గత ఏడాదిగా వార్తలు వస్తున్నాయి. కాని ఇది రూమర్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు కారణం శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడని పలుమార్లు వార్తలు వచ్చాయి. ఇద్దరు సినిమా చేయాలని చాలా సార్లు ట్రై చేశారు. కాని ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దాంతో ఇది కూడా అయ్యే పని కాదని చెప్పుకున్నారు.

అయితే గత వారం పదిరోజులుగా ఇదే న్యుస్ వచ్చి హాట్ టాపిక్ గా మారింది. కాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఈ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. తాజాగా శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో దిల్ రాజు భారీ పాన్ ఇండియన్ సినిమాని నిర్మిస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడం విశేషం. ఇక రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమా కావడం కూడా మరొక విశేషం.

ప్రస్తుతం చరణ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా కనిపిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు. భారీ మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. అలాగే మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ మల్టీస్టారర్ గా తెరక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. రాం చరణ్ – నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 13 న ఆచార్య రిలీజ్ కానుండగా ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నాయి.