భోళా శంకర్‌కీ వాల్తేర్ వీరయ్యకీ అదే తేడా.?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, ఆ హిట్టు చాలా ఆలస్యంగా దక్కింది. సినిమా రిలీజ్ టైమ్‌కి చాలా నెగిటివిటీ చుట్టు ముట్టింది ‘వీరయ్య’ సినిమాకి. అదే నెగిటివిటీ ఇప్పుడు ‘భోళా శంకర్’నీ వెంటాడుతోంది.

సినిమా బాలేదంటూ ప్రచారం చేస్తున్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అయితే, ‘వాల్తేర్ వీరయ్య’ డైరెక్ట్ తెలుగు సినిమా. ‘భోళా శంకర్’ విషయానికి వస్తే రీమేక్ సినిమా. స్ర్టెయిట్ మూవీకీ, రీమేక్ మూవీకి కొన్ని డిఫరెన్సెస్ వుంటాయ్.

రీమేక్స్‌లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయ్. పోలికలే అందుకు కారణం. అయితే, ‘భోళా శంకర్’ హిట్టుతో చిరంజీవికి పెద్దగా ఫరక్ పడే అవకాశం లేదు. నిర్మాతలకీ అంతే. కానీ, దర్శకుడిగా మెహర్ రమేష్‌కే కాస్త త్రెట్ వుందని చెప్పొచ్చు.

‘వాల్తేర్ వీరయ్య’తో డైరెక్టర్ బాబీ కమ్ బ్యాక్ అయ్యాడు. మరి, ‘భోళా శంకర్’ మెహర్ రమేష్‌ని నిలబెడుతుందా.? తెలియాలంటే ఇంకాస్త టైమ్ పడుతుంది. ప్రచారాన్ని పక్కన పెట్టి నిజాన్ని ఆడియన్స్ గ్రహించడంలోనే ఫలితం ఆధారపడి వుంది.