పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో మహేష్ బాబుకి దెబ్బేసిన త్రివిక్రమ్.!

రీసెంట్‌గా మహేష్ బాబు సినిమాకి సంబంధించి రకరకాల స్టిల్స్ పేరుతో పోస్టర్లు రిలీజ్ చేశారు. అలాగే, సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే పురస్కరించుకుని ఓ చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

మహేష్ ఫ్యాన్స్ ఈ విషయంలో కొంత హ్యాపీగానే వున్నప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ వారిని హర్ట్ చేస్తున్నాయ్. ఇది గురూజీ త్రివిక్రమ్ సినిమా. త్రివిక్రమ్ అంటే ఆ రేంజే వేరు. డైలాగ్స్.. ఏంబియన్స్.. ఇలా అన్నింట్లోనూ పక్కాగా కొన్ని లెక్కలుంటాయ్.

కానీ, టైటిల్ దగ్గర్నుంచీ స్టిల్స్ వరకూ.. ఆఖరికి డైలాగ్ కింగ్ అని పేరున్న త్రివిక్రమ్, ఈ సినిమాలో మహేష్ డైలాగుల్ని సైతం కూలీ చేసేశాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో త్రివిక్రమ్ బిజీగా వున్నారన్న వాదన వుంది. డైరెక్ట్‌గా కాకపోయినా, ఆయన చేస్తున్న ప్రతీ సినిమాకీ డైలాగ్స్ పరంగానో, స్ర్కీన్‌ప్లే పరంగానో త్రివిక్రమ్ హ్యాండ్ బిహైండ్‌గా వుంది.

ఆ బిజీలోనే మహేష్ సినిమాని ఇలా గజిబిజి చేసేశాడా గురూజీ.! ఏదో నామ్ కే వాస్తే స్టిల్స్ రిలీజ్ చేసి పడేశాడా.? అని అనుకుంటున్నారు. నాలుగైదు స్టిల్స్ వచ్చాయ్ అన్నింట్లోనూ ఒకటే చొక్కా.. బీడీ, త్రీడీ.. అంటూ ఆ డైలాగులేంటీ.? అసలు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఏంట్రా బాబూ.! ఇదీ మహేష్ తాజా సినిమా అప్డేట్ విషయంలో వస్తున్న ట్రోల్స్.