కొణిదెల బ్యానర్‌ని పక్కన పడేసినట్లేనా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారి, కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్‌పై తండ్రి చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మూవీస్‌ని వరుసగా రూపొందిస్తూ వస్తున్నాడు రామ్ చరణ్.

ఈ బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. అయితే, ‘ఆచార్య’ సినిమా మాత్రం పెద్ద షాకిచ్చింది. కోలుకోలేని దెబ్బ కొట్టేసింది. దాంతో, రామ్ చరణ్ సెకండ్ థాట్ చేస్తున్నాడట. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ ఓనర్‌లలో ఒకరైన విక్రమ్‌తో కలిసి ‘వి – మెగా పిక్చర్స్’ అనే బ్యానర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట.

ఇక నుంచీ ఇదే బ్యానర్‌లో సినిమాలు రూపొందించబోతున్నాడట రామ్ చరణ్. అంటే, కొణిదెల ప్రొడక్షన్స్‌ని పక్కన పెట్టేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇకపై ఈ బ్యానర్ నుంచి సినిమాలు వుండవని ఇన్‌సైడ్ ప్రచారం. నిజంగానే కొణిదెల ప్రొడక్షన్స్‌ని చరణ్ లైట్ తీసుకోబోతున్నాడా.? తెలియాల్సి వుంది.