Rajamouli: మెగా అభిమానులతో పాటు, నందమూరి అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. కరోనా మరియు కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు విడుదల అవుతుందని తెలియగానే థియేటర్లలో రచ్చ రచ్చ చేసేందుకు, తమ అభిమానాన్ని చూపించేందుకు ఫ్యాన్స్ సిద్దంగా ఉన్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా….అదే డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను చూసేందుకు కేవలం ఇండియాలోనే కాదు, వివిధ దేశాల్లోనూ ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అన్ని సినిమా థియేటర్లలోనూ టికెట్స్ అయిపోయాయి. బుకింగ్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే ఫిల్ అవడం చెప్పుకోదగిన విషయం.
అయితే ఇక్కడ రాజమౌళి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన ఏ సినిమా తీసిన ఆయన మార్క్ ఉండేలా తీస్తాడు అనడం ఏం సందేహం లేదు. ఒక సినిమా కోసం ఆయన చేసే కృషి, పట్టుదల మాటల్లో చెప్పలేనిది. దానికి ఉదాహరణగా ఎంతో మంది కళ్ళ ఎదుట మెదిలిన చిత్రం బాహుబలి అని చెప్పవచ్చు. ఆ చిత్రంలోని నటీనటులు, ఆర్టిస్టులు, తదితరులు ఎంత కష్ట పడి ఉండకపోతే అంత భారీ హిట్ ను సొంతం చేసుకుంటుంది. అలా వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా చేయడానికి మూల కారకుడు రాజమౌళి.
అదే సూత్రాన్ని రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికీ వర్తింప జేశాడు అనడంలో అసలు సందేహమే లేదు. పర్ఫెక్షన్ విషయంలో ఏ మాత్రం రాజీ పడని దర్శకుడు రాజమౌళి. ఆ పర్ఫెక్షన్ కోసం ఆయన ఎంత కష్టమైనా పడతాడు. ఒక్క సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం నటీ నటులను కష్ట పెట్టడమే కాదు, ఆ విషయంలో ఆయన కూడా ఎప్పుడూ ముందే ఉంటాడు అని తాజాగా ఒక విషయాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. అదేంటంటే ఇప్పటికే భారీ అంచనాలతో రిలీజ్ కావడానికి సిద్దంగా ఉన్నా ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ కు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ అది అంత హిట్ కావడం వెనుక ఉన్న చాలా కష్టమే ఉందని రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తెలిపారు. ఆ పాట పర్ఫెక్ట్ గా రావడం కోసం వారు ఆల్మోస్ట్ 17 టేక్ లు తీసుకున్నారట. అప్పటికి గానీ మన జక్కన్న సాటిస్ ఫై కాలేదట. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, వారితో 17 టేక్ లు తీయించినా, వారు చేసిన సెకండ్ స్టెప్ నే ఓకే చేసేసారట రాజమౌళి. జస్ట్ పర్ఫెక్షన్ కోసమే అన్ని టేకులు తీయించారు అని ఈ స్టార్ హీరోస్ చెప్తూ ఉంటే, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది కదూ…!