Nagarjuna: ఇటీవల అక్కినేని వారసుడు నాగచైతన్య శోభితల వివాహం ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించి ఎన్నో విషయాలు కూడా బయటకు వస్తున్నాయి.
ఇక వీరి వివాహం ఒక అగ్రిమెంట్ ప్రకారం జరిగింది అంటూ తాజాగా మరొక వర్గ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వీరి వివాహ సమయంలో నాగార్జున వీరి చేత ఓ అగ్రిమెంట్ రాయించుకున్నట్టు సమాచారం ముఖ్యంగా శోభిత చేత ఈ అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకున్నారని తెలుస్తోంది. భవిష్యత్తులో కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోవాల్సి వస్తే కనుక ఆస్తిలో సగం వాటా తనకు భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే అగ్రిమెంట్ చేయించుకున్నట్టు సమాచారం.
వీరిద్దరూ సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తే కనుక నాగేశ్వరరావు గారు సంపాదించిన ఆస్తి అలాగే నేను సంపాదించిన ఆస్తిలో ఏమాత్రం వాటా ఇవ్వడం కుదరదని నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే తనకు చెందుతుంది అంటూ నాగార్జున ఒక అగ్రిమెంట్ చేయించి ఆ అగ్రిమెంట్ పై శోభిత చేత సంతకాలు చేయించారని తెలుస్తుంది.
ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొంతమంది నాగార్జున చేసిన పనిని సమర్థిస్తున్నారు. ఇటీవల కాలంలో సెలెబ్రెటీలు విడాకులు తీసుకొని విడిపోవడం చూస్తుంటే ఆయన చేసిన పని చాలా మంచిదేనని అర్థమవుతుంది. ఇప్పటికే నాగచైతన్య సమంత విడిపోవడం జరిగింది అందుకే ముందస్తు జాగ్రత్త తీసుకున్నారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.