మహేష్ బాబు నమ్రత ఇంత లవ్ స్టోరీ నడిపించారా… వామ్మో వీళ్ళ లవ్ స్టోరీ మామూలుగా లేదు?

ప్రస్తుత కాలంలో ఓ జంట ప్రేమలో ఉన్నారంటే చాలు పెద్ద ఎత్తున సినిమాలకు వెళ్లడం పార్కులకు వెళ్లడం షికారులు చేయడం చేస్తుంటారు. ఇలా ఒక మనిషి ప్రవర్తన చూస్తేనే వీళ్ళు ప్రేమలో ఉన్నారని వెంటనే గుర్తుపట్టవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నప్పటికీ ఏమాత్రం వారి ప్రేమ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత ఒకరిని చెప్పాలి. మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నటి నమ్రతతో పరిచయం ఏర్పడి అనంతరం ఆ పరిచయం ప్రేమగా మారింది.

ఈ విధంగా వంశీ సినిమాతో మొదలైన వీరి ప్రేమ అలాగే రెండు సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చింది. ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం ఎక్కడ తెలియకుండా ఎంతో జాగ్రత్త పడుతూ వచ్చారు. నమ్రతను ప్రేమించిన మహేష్ బాబు తనకు ఎప్పుడూ కూడా ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని తెలుస్తోంది. వీరు ప్రేమలో ఉన్న సమయంలో కూడా నమ్రత పలు టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో నటించారు. ఎప్పుడు తన నటనకు ఈయన అడ్డు చెప్పలేదని తెలుస్తోంది. పలానా హీరోలతో మాత్రమే నటించాలని ఇలాంటి కాస్ట్యూమ్ మాత్రమే వేసుకోవాలని మహేష్ బాబు ఎప్పుడు చెప్పలేదట.

ఈ విధంగా వీరిద్దరూ ఒకరికొకరు వారి అభిప్రాయాలను గౌరవించుకొని ఎంతో అన్యోన్యంగా ఉండడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి. ఇలా నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్ బాబు పెళ్లి తర్వాత తాను సినిమాలలో నటించకూడదని ఆమెకు ఎలాంటి కండిషన్స్ పెట్టకపోయినా నమ్రతనే సినిమాలకు దూరమయ్యారని తెలుస్తోంది. మహేష్ బాబు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుటుంబ బాధ్యతలను చూసుకోవడం కుదరకపోవడంతో కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకొని ఎంతో చక్కగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా వీరి జంట ఎంతోమందికి ఆదర్శ జంటగా, ఎంతో ప్రేమగా వైవాహిక జీవితంలో ముందుకు వెళుతున్నారని చెప్పాలి.