మహేష్‌బాబు ‘ఒరిజినల్’ కామెంట్‌.! సబబేనా.?

సినిమా వేడుకలంటే అనవసర పొగడ్తలు మామూలే. చిరంజీవి అయినా, ఇంకొకరైనా.. పొగడ్తలు తప్పనిసరి. అదే సినీ‘మాయ’.!

‘యానిమల్’ సినిమా గురించి ప్రస్తావిస్తూ, సందీప్ రెడ్డి వంగా తన కంటే బెస్ట్ డైరెక్టర్.. అని అర్థం వచ్చేలా రాజమౌళి మాట్లాడటాన్ని తప్పు పట్టలేం. అది, ఆ సినిమాని ప్రమోట్ చేయడం కోసమే.

అలాగే, మహేష్‌బాబు కూడా, తాను రణ్‌బీర్ కపూర్‌కి వీరాభిమానినని చెప్పాడు. అంతేనా, ఒరిజినల్ సినిమా, ఒరిజినల్ డైరెక్టర్.. అంటూ సందీప్ రెడ్డి వంగాని ఆకాశానికెత్తేశాడు మహేష్.

ఈ విషయాలు కాస్త తీరిగ్గా చర్చనీయాంశమవుతున్నాయి. మహేష్ మరీ ‘అతి’ చేశానీ, రాజమౌళి కూడా హద్దులు దాటాడనీ.. సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా, రామ్ గోపాల్ వర్మనీ.. సందీప్ రెడ్డి వంగానీ ఒకరితో ఒకరిని పోల్చి రాజమౌళి తప్పు చేశాడని అంటున్నారు.

‘మహేష్ అలా అస్సలు మాట్లాడి వుండకూడదు..’ అని మహేష్ అభిమానులే గుస్సా అవుతున్నారు. ‘యానిమల్’ సినిమా హిట్టయితే సరే సరి, తేడా కొడితే మాత్రం.. మహేష్ విపరీతంగా ట్రోల్ అవుతాడు. ఆయన్ని ట్రోల్ చేయడానికి చాలామంది కాచుక్కూర్చున్నారు.