కృష్ణ గారు ఈ కోరికలు తీరకుండానే మరణించారా… తీరని కోరికలు ఏమిటంటే?

సూపర్ స్టార్ కృష్ణ నేడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉదయం నాలుగు గంటల సమయంలో కాంటినెంటల్ హాస్పిటల్లో మరణించారు. ఈయన మరణ వార్త తెలియగానే ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ విధంగా కృష్ణ గారు మరణించారని వార్త ఇటు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులను కూడా ఎంతగానో కలిసి వేస్తుంది.కృష్ణ గారు మరణించడంతో ఎంతోమంది ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా కృష్ణ గారు మరణించిన తర్వాత ఆయనకు తీరకుండా మిగిలిపోయిన కోరికల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఈయన కూడా కొన్ని కోరికలు తీరుకుండానే మరణించారని తెలుస్తుంది. అయితే ఈయనకు ఉన్న ఆ కోరికలు ఏమిటి అనే విషయానికి వస్తే… కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు చత్రపతి శివాజీ పాత్రలో నటించాలని చాలా కోరికగా ఉండేదట అయితే ఈయన కోరిక నెరవేరకుండానే మరణించారు. ఇకపోతే అమితాబచ్చన్ మాదిరిగా ఈయన కూడా ఏదైనా ఒక టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాలని చాలా ఆశపడ్డారట. ఇక ఈ కోరిక కూడా నెరవేరకుండా ఉండిపోయింది.

కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో జేమ్స్ బాండ్ కౌబాయ్ వంటి చిత్రాలలో నటించారు అలాగే తన కుమారుడు మహేష్ బాబుని సైతం జేమ్స్ బాండ్ తరహా పాత్రలలో నటిస్తే చూడాలని ఆశపడినప్పటికీ మహేష్ బాబుకు ఇలాంటి పాత్రలలో నటించడం ఇష్టం లేక ఆ కోరిక కూడా కోరికగానే మిగిలిపోయింది.కృష్ణ గారు హీరోగా కొనసాగుతున్న సమయంలో ఆయన కుమారులు రమేష్ బాబు మహేష్ బాబుతో కలిసి సినిమాలలో నటించారు. అదేవిధంగా తన మనవడు గౌతమ్ తో కలిసి ఒక సినిమాలో నటించాలని కోరికగా ఉండేదట ఈ నాలుగు కోరికలు తీరకుండానే కృష్ణ గారు మరణించారని తెలుస్తోంది.