Pushpa Movie: పుష్ప ఐటమ్ సాంగ్.. దేవీ శ్రీ కాపీ కొట్టాడా?

Pushpa Movie: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పుష్ప ఐటమ్ సాంగ్ రానే వచ్చింది. అల్లు అర్జున్ కెరియర్ లో మొట్ట మొదటిసారిగా సమంత ఐటమ్ సాంగ్ చేస్తుంది. అంతే కాకుండా అక్కినేని చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత చేస్తున్న మొదటి టాలీవుడ్ సినిమా ఇది. దీంతో ఈ పాట మీద చాలా హోప్స్ పెంచుకున్నారు ప్రేక్షకులు. పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న పుష్పా మూవీ లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన హీరోయిన్ నటిస్తుంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుంటే దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

ఇప్పటికే పుష్ప నుండి రిలీజైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచి యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ రాబడుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే మ్యూజిక్ పరంగా సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోయిన్ సమంతా ఐటమ్ సాంగ్ అంటేనే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవాల్సిందే.

అయితే “పుష్ప” సినిమాలోని సమంత ఐటమ్ సాంగ్ ‘ఊ మావ’ సాంగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాట ఎక్కడో విన్నట్టు ఉందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం సూర్య హీరోగా నటించిన వీడొక్కడే సినిమా లోని హనీ హానీ పాటలా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు పాటలకి అచ్చం ఒకేలా మ్యూజిక్ ఉందని అనిపిస్తుంది అని అంటున్నారు.. మరి మీకేం అనిపిస్తుంది.. దేవి శ్రీ కాపీ కొట్టాడా? అని అంటున్నారు నెటిజన్లు.