కమ్ముల సినిమా.. ధనుష్ కు మరో గోల్డెన్ బాక్సాఫీస్ పక్కా!

ఈ మధ్య తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలా ఈ ఏడాది సంక్రాంతికి వారసుడు సినిమాతో విజయ్ తెలుగులో మంచి కలెక్షన్లు సాధించాడు. ఆ తర్వాత ధనుష్ సార్ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇది తమిళంలో వాథి పేరుతో రిలీజ్ అయింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అయితే రాబడుతోంది. ఇక ధనుష్ కు తెలుగులో పట్టు దొరికేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇక ఆయన ఫస్ట్ తెలుగు సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములతో ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే అది పట్టాలెక్కలేదు. ఆ తర్వాత సార్ మూవీ విడుదల అయింది. ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లి. సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అప్పట్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో తెరకెక్కనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పుడు ధనుష్ – కమ్ముల సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుందని సమాచారం. ఇక ఈ సినిమా తెలుగులోనే 50 నుంచి 70 కోట్ల మధ్యలో బిజినెస్ పక్కా అంటున్నారు. ఇక ఈ సినిమా ధనుష్ కెరియర్లో బెస్ట్ గా నిలవచ్చని అంచనా. మొత్తానికి ధనుష్ 150 కోట్ల రేంజ్ బిజినెస్ పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక ఈ సినిమా పాన్ ఇండి లెవెల్ లో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేయనున్నారట. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తారని సమాచారం. ఇక ఇటీవల తెలుగులో సార్ సినిమాతో హిట్ కొట్టిన ధనుష్.. అదే జోష్లో ఉన్నారు. చూడాలి ఇక ధనుష్ కేరియర్ బెస్ట్ సినిమాను కమ్ముల అందిస్తాడో లేదో.