ధమాకా బ్యూటీ బిజీబిజీ.. పర్ఫెక్ట్ టైమింగ్

పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన శ్రీలీల ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపకపోవడంతో ఎదురుదెబ్బ తగిలింది. మొదట అయితే ఆమె ప్రతిభను దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమె అనతికాలంలోనే టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది.

శ్రీ లీల ఇప్పుడు తన డేట్స్ విషయంలో కొత్త తరహా ప్రణాళికలు రచిస్తోంది. ఓకే రోజు కొన్ని గంటలను డివైడ్ చేసి ఆమె మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఉదయం ఒక షూట్ అలాగే మధ్యాహ్నం మరొక షూట్ , సాయంత్రం మరో సినిమా షూట్ అంటూ ఇలా డివైడ్ చేసుకొని టైమ్ మేనేజ్మెంట్ ను చక్కగా ఫాలో అవుతోంది. ఇక ఇటీవల ధమాకా హిట్ తో శ్రీ లీల యొక్క ప్రజాదరణను అంచనా వేయవచ్చు.

తన తొలి చిత్రం పరాజయం పాలైనప్పటికీ, శ్రీ లీల తన నటనా నైపుణ్యంతో చిత్రనిర్మాతలను మెప్పించగలిగింది. ఇప్పుడు ఏకకాలంలో ఎనిమిది చిత్రాలకు పనిచేస్తోంది. ఆమె రాబోయే కొన్ని ప్రాజెక్ట్‌లలో SSMB28, ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ 32, అనగనగా ఒక రాజు, జూనియర్ మరియు బోయపాటి శ్రీను సినిమాలు ఉన్నాయి. ఆమె NBK108కి కూడా సంతకం చేసింది.

సెకండ్ హీరోయిన్‌గా నటించడం ద్వారా శ్రీ లీల తన స్టార్‌డమ్‌ను ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదని కొందరు విమర్శకులు భావిస్తున్నప్పటికీ, ఆమెకు మాత్రం ఒక క్లారిటీ ఉంది. ఏకకాలంలో విభిన్నమైన ప్రాజెక్టులలో పని చేస్తూనే ఉంది. మరి అనేక చిత్రాలకు సంతకం చేసిన ఆమె నిర్ణయం కెరీర్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.