ఇండస్ట్రీ టాక్ : “దేవర” అప్పుడే ఇంత అయ్యిపోయిందా?

రానున్న రోజుల్లో పాన్ ఇండియా వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయగలిగే అతి కొద్ది చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “దేవర” కూడా ఒకటి. మరి ఓ పవర్ ఫుల్ నేపథ్యంలో కొరటాల డిజైన్ చేసిన ఈ సినిమా భారీ ఏక్షన్ సీక్వెన్స్ లతో నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కుతుంది.

దీనితో ఈ చిత్రంపై క్రేజీ హైప్ నెలకొంది. పైగా అనిరుద్ లాంటి ఫామ్ లో ఉన్న సెన్సేషనల్ దర్శకుణ్ణి పెట్టుకోవడంతో ఏ అంశంలో కూడా ఈ చిత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం చాలా పాన్ ఇండియా సినిమాల కన్నా లేట్ గానే స్టార్ట్ అయ్యినప్పటికీ ఈ చిత్రం వాటి కన్నా ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందట.

ఈ సినిమా కన్నా ముందే రేస్ లో ఉన్న పుష్ప 2, గేమ్ చేంజర్ లాంటి చిత్రాలు ఎప్పుడో మొదలై ఇంకా 70 శాతం లోపే ఉన్నాయి. కాగా దేవర మాత్రం ఇప్పుడు ఆల్ మోస్ట్ సగం సినిమా కంప్లీట్ అయిపోవచ్చింది అని సినీ వర్గాల్లో టాక్. అంతే కాకుండా ఈ భారీ చిత్రం పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్తుండడం దీనికి కారణం అని తెలుస్తుంది.

సో వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్ టైం రిలీజ్ కి ఉంటుంది అని అంటున్నారు. ఇక ఈ మాసివ్ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు తెరకెక్కిస్తుండగా అత్యంత సాంకేతిక వర్గంతో తెరకెక్కుతుంది.