‘దేవర’ కోసం అలియా భట్‌ని తీసుకొస్తున్నారా.?

జూనియర్ ఎన్టీయార్‌తో కలిసి నటించడం తన డ్రీమ్.. అంటూ కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చెప్పింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి నటించింది కూడా. కానీ, రామ్ చరణ్‌కి జోడీగా ఆ సినిమాలో నటించింది అలియా భట్.

నిజానికి, జూనియర్ ఎన్టీయార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనీ, అతనితో తెరపై ఆడిపాడాలనీ అనుకున్న అలియా భట్‌కి ఆ కోరిక తీరలేదు. అయితే, ఆ కోరిక త్వరలో తీరేలా వుంది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘దేవర’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌తో చేయించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ విషయమై ఇప్పటిక దర్శకుడు కొరటాల శివ, అలియా భట్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

ఎలాగూ అలియా భట్‌కి జూనియర్ ఎన్టీయార్‌తో కలిసి సాంగ్ చేయాలంటే స్పెషల్ ఇంట్రెస్టే అవుతుంది. సో, అలియా ఈ సినిమాకి ఓకే చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే, తెరపై జూనియర్ ఎన్టీయార్ – అలియా భట్ వేసే స్టెప్పులు అభిమానుల్ని ఓ రేంజ్‌లో అలరిస్తాయన్నది నిర్వివాదాంశం.

‘దేవర’ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్ ఈ ఏడాదిలోనే విడుదలవుతుంది. వాస్తవానికి, సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి వున్నా, అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది.

‘దేవర’లో జూనియర్ ఎన్టీయార్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.