కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ దేవర పై రోజు రోజుకు అంచనాలు అమితంగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. విడుదల టార్గెట్ ను పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసుకున్న కొరటాల శివ అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి పూర్తిచేసేలా ప్రణాళికలు కూడా రచిస్తున్నాడు.
ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో ఆలస్యం జరగకూడదు అని కూడా చిత్ర యూనిట్ అనుకుంటోంది. ఇక ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే మొదటి సాంగ్ ను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి పాటలను అందిస్తున్నారు.
మొదటి పాట దేవర క్యారెక్టర్ తో పాటు అతని చుట్టూ ఉండే ప్రపంచాన్ని హైలెట్ చేసే విధంగా ఉంటుందట. ఇక అతను ఎదుర్కొనబోయే సవాళ్ళను కూడా ఆ పాటలో అంతర్లీనంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మొదటి పాట కోసమే రామజోగయ్య శాస్త్రి ఎక్కువ టైం తీసుకుని రాస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఆ పాటను మరొక లెవెల్లోకి తీసుకు వెళ్లే విధంగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ తోనే సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఆ పాట వైరల్ అయ్యేలా ప్రమోషన్స్ కూడా చేయాలని ఎన్టీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ గా కనిపిస్తూ ఉండగా జాన్వికపూర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో చూడాలి.