విడుదలకు ముందే ‘దేవర’ ఓటిటి రైట్స్‌!

ఓటీటీ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌ కోసం పోటీ మొదలయిపోతోంది. ఇప్పటికీ ఎన్నో సినిమాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ’దేవర’ కూడా యాడ్‌ అయ్యింది. ఎన్‌టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో మూవీ అని తెలియగానే ప్రేక్షకుల్లో విపరీతంగా ఆసక్తి పెరిగిపోయింది.

ఇక ఇందులో ఎన్‌టీఆర్‌ లుక్‌తో పాటు టైటిల్‌ రివీల్‌ చేయగానే ఫ్యాన్స్‌ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అప్పటినుండే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ కోసం సంస్థలు పోటీపడ్డాయి. ్గªనైల్‌గా ’దేవర’ ఓటీటీ రైట్స్‌ను రికార్డ్‌ ప్రైజ్‌తో నెట్‌ప్లిక్స్‌ సొంతం చేసుకుందని సమాచారం.

కొరటాల శివ, ఎన్‌టీఆర్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే ’జనతా గ్యారేజ్‌’ సినిమా వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఒక మంచి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ కథకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడిరచి హిట్‌ కొట్టడం కొరటాల శివ స్టైల్‌. అలాంటి ఈసారి ఎన్‌టీఆర్‌తో ’దేవర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదలయినప్పటి నుండి కొరటాల ముందు సినిమాల్లో లేని డిఫరెంట్‌ ఎలిమెంట్స్‌ ఇందులో ఉన్నాయని ప్రేక్షకులు బలంగా నమ్మడం మొదలుపెట్టారు. పైగా ఇందులో వైలెన్స్‌ కూడా బాగానే ఉంటుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. దానికి తగినట్టుగానే తాజాగా విడుదలయిన ‘దేవర’ గ్లింప్స్‌ కూడా పూర్తి యాక్షన్‌తో ఉంది.