తల్లిదండ్రులు కాబోతున్న రణ్‌వీర్‌ – దీపిక!

బాలీవుడ్‌లో బెస్ట్‌ కపుల్‌గా పేరున్న దీపికారణ్‌వీర్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. సెప్టెంబర్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చినట్లు దీపిక పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. 2013లో విడుదలైన ‘రామ్‌ లీలా’ కోసం దీపికారణ్‌వీర్‌ తొలిసారి కలిసి వర్క్‌ చేశారు.

ఈ సినిమా టైమ్‌లో దీపికతో ఆయనతో ప్రేమలో పడ్డారు. 2018, నవంబర్‌లో ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్న ఈ క్యూట్‌ కపుల్‌ తమ ప్రేమను శాశ్వతమైన అనుబంధంగా మార్చుకున్నారు. ప్రతి సందర్భంలోనూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా మెరిసిపోతూ.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలుపుతూ ఉంటారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. ”రణ్‌వీర్‌కు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలతో మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసుకోబోయే ఆ క్షణం కోసమే మేమూ ఆతృతగా ఎదురుచూస్తున్నాం. చిన్నప్పట్నుంచి మా అమ్మానాన్నలు నన్ను ఎంతో క్రమశిక్షణతో, వినయంగా పెంచారు. రణ్‌వీర్‌ కూడా ఇలాంటి వాతావరణంలోనే పెరిగాడు. అందుకే మేమూ మా పిల్లల్ని సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా సాధారణంగానే పెంచాలనుకుంటున్నాం. మంచి విలువల్ని నేర్పించాలనుకుంటున్నాం’ అని తెలిపారు. ఇటీవల వీళ్లిద్దరూ ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’లో పాల్గొన్నారు. వాళ్ల పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. డిస్నీహాట్‌స్టార్‌ వేదికగా ప్రసారమైన ఆ ఎపిసోడ్‌లోనే తొలిసారి వీరి పెళ్లి వీడియో బయటకు వచ్చింది.