బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా ’స్కంద’ సెప్టెంబర్ 15న విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది, అందులో బోయపాటి మార్కు అదే నరుక్కునే సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీలీల కథానాయకి, థమన్ సంగీతం అందించాడు, ఈ సినిమాలో పాటలు వైరల్ అయ్యాయి కూడా. నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చి సినిమా యూనిట్ కి విషెస్ చెప్పాడు.
అలాగే ఇందులో సాయి మంజ్రేకర్ కూడా వుంది. ఇదిలా ఉండగా..ఈ సినిమా నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమా సాటిలైట్, ఓటిటి చానెల్స్ తో మంచి డీల్ కుదుర్చుకున్నాడు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. దక్షిణాదికి చెందిన నాలుగు భాషలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఓటిటి, అలాగే సాటిలైట్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి అమ్మినట్టుగా తెలిసింది.
దీని ద్వారా నిర్మాతకి రూ. 54 కోట్లు వచ్చిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఈ సినిమా హిందీ ఓటిటి, సాటిలైట్ హక్కులు జీ స్టూడియో వాళ్ళు రూ.35 కోట్లకు కొనుక్కున్నారని, ఇది కాకుండా.. ఈ చిత్రం ఆడియో హక్కులు కూడా రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయని.. ఇవన్నీ కలిపితే సుమారు రూ. 98 కోట్లు ఇక్కడే నిర్మాతకి వచ్చిందని తెలుస్తోంది.
ఏ రకంగా చూసినా ఈ సినిమా నిర్మాతకి విడుదలకి ముందే లాభాలు వచ్చాయని, ఇక సినిమా విడుదల తరువాత థియేటర్స్ రైట్స్ మీద వస్తే అవన్నీ కూడా లాభాల పంట పండుతుందని చెప్పుకుంటున్నారు. అదీ.. సంగతీ!!