లేటెస్ట్ : “వాల్తేరు వీరయ్య” రెండో సాంగ్ కి డేట్ ఫిక్స్డ్.!

టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మాస్ లాస్ట్ బ్లాస్ట్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మరి ఈ చిత్రం వచ్చే ఏడాది ఈ చిత్రం సంక్రాంతి బరిలో భారీ పోటీతో రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ బాస్ పార్టీ అయితే క్రేజీ హిట్ కాగా రీసెంట్ గానే సినిమా రెండో సాంగ్ మెగాస్టార్ లీక్ చేయడం వైరల్ గా మారింది. మరి ఈ సాంగ్ ని అయ్యితే “శ్రీదేవి, చిరంజీవి” అనే టైటిల్ తో అనౌన్స్ చేశారు.

అలాగే ఈ సాంగ్ ని అయితే ఈ డిసెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. అలాగే దీనిపై చిరు మరియు శృతి హాసన్ పై ఓ సూపర్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీనితో అయితే ఇపుడు మెగా ఫ్యాన్స్ ఈ మెలోడి నెంబర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.